విచ్చేయరాదా వెలది కడకు నీవు యిచ్చ నాసపడు వారి నెలయించదగునా
నిలిచి నిలిచి నీకు నిక్కి యెదురు చూచీని వలచిన సతి నీవు వచ్చేవంటా
మలసి మలసి నీ మాటలే ఆలకించీని యెలమి నేమని యానతిత్తువో యనుచు
చిమ్మి చిమ్మి నీ యింటికి చేతులే చాచీని తెమ్మల ఆసన్న నీవు తెలుతు వంటా
కుమ్మరించి గుట్టుమాని నవ్వీని పమ్మినీవు తన కొంగు పట్టుదువో యనుచు
పూచి పూచి నీ వద్దికి పొలతుల నంపీని యేచక నీ విప్పుడిట్టె యేలుదు వంటా
రేచి రేచి వలపుల రేసువాయ గూడితివి దాచెను శ్రీ వేంకటేశ తమక మేలనుచు
మ౦చికార్య౦ చేసారు.కాస్త వ్యాఖ్యాన౦ కూడా రాస్తే బాగు౦టు౦ది.
ReplyDeleteఈ చరణంలో ముద్రణాదోషం ఉందనిపిస్తోంది
ReplyDeleteచిమ్మి చిమ్మి నీ యింటికి చేతులే చాచీని తెమ్మల ఆసన్న నీవు తెలుతు వంటా
కుమ్మరించి గుట్టుమాని నవ్వీని పమ్మినీవు తన కొంగు పట్టుదువో యనుచు
మొదటి సంగతి. సరైన వ్రాతపధ్ధతి ఇలా ఉండాలి
చిమ్మి చిమ్మి నీ యింటికి <>చేతులే చాచీని
తెమ్మల ఆసన్న నీవు <>తెలుతు వంటా
కుమ్మరించి గుట్టుమాని <>నవ్వీని
పమ్మినీవు తన కొంగు <>పట్టుదువో యనుచు
ఇప్పుడు యతిప్రాసలు చక్కగా కనిపిస్తున్నాయి కదా?
ఈ చరణం మూడవపాదంలో యతిస్థానం తరువాత మాత్రలు తక్కువగా ఉన్నాయి. ఒకమాట ఎగిరిపోనట్లు తెలుస్తోంది. రెండవ పాదంలో కూడా కొంత ఇబ్బంది ఉంది. ఒక మారు మూలంతో సరిజూచుకోండి.