శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, August 7, 2010

అనతియ్య గడవయ్య

అనతియ్య గడవయ్య ఆకడ నీకడ నీకు తానకపు కానుకలు దక్కేనో దక్కదో

మోవితేని బోనాలు మోసునవ్వు మొనాలు ఆవల చెలి యొకతె అంపె నీకదే
కాని కంటి కుంకుమలు కమ్మవూర్పు సురటులు ఈవల నీకంపితిని ఎక్కెనో యెక్కదో

చేసన్న వీడేలు చిమ్ముగోరి మేడేలు పోసరించి వేరొకతె పుత్తెంచె నీకు
యీసు జెమట పన్నీరు యింపుగాకల రతులు వాసిగ నీకంపితిని వచ్చెనో రాదో

పలుకుల కప్పురాలు భావారతి చప్పరాలు యెలమి శ్రీవేంకటేశ యిచ్చే నెవ్వెతో 
బలు సరసపు మొక్కు పాన్పుపై కూటమి చొక్కు తలకిక నీకిచ్చితిని తనిసెనో తనియదో  

No comments:

Post a Comment