నవ్వు వచ్చీ నిన్ను జూచి నాకు నేడు యీ రవ్వలు నీకేచెల్లు రాజసపు దేవుడా
సతికుచముల మోవ సాము జేసినటు వలె సతముగా మోచేవు శంఖ చక్రములు
మతకాన వేడుకొనే మార్గమున నున్నట్లు తతి నభయహస్తము తప్పవు నీవిపుడు
కామిని నలిమిపట్టే గతి యలవాటుగా యేమరపు కటిహస్త మెంతైనా నీవు
నేమాననామెరాక నిక్కిచూచే మతకాన కోమలపు నీకునిల్వు కొలువులే యిపుడు
అంకె వుపరి సురత మలవాటు చెడకుండా ఉంకువ శ్రీసతి మోచే పురమున
అంకి శ్రీవేంకటాద్రి నంది మమ్ముగాచేటి పొంకపు మన్ననల చూపులు జల్లేవిదిగో
No comments:
Post a Comment