వీని జూచియైన నేము విరతిబొందగలేము పూని మాబ్రదు కిందుబోలదాయగా
వరుల వేడగబోవు పరనిందకు జొరవు పరపురుషార్థమే ఫలవృక్షతతులెల్ల
నరులమై ఘనులమై నానాబుద్ధు లెఱిగి పొరి మాబ్రదుకు లిందుబోలదాయగా
కామక్రోధాలు లేవు కామతత్త్వ మెఱగవు కామించినట్లవు నెక్కడనైనా శిల లివి
దీమసము గలిగియు దెలివి గలిగియును భూమిలో మాబ్రదుకు కిందుబోలదాయగా
వొకరి గొలువబోవు వొకపంట సేయబోవు వొకమానిగూడు చేరివుండు పక్షు లాడనాడ
వొకశ్రీవేంకటపతి నమ్మియుండలేము మొకెమో మాబ్రదు కిందుబోలదాయగా
No comments:
Post a Comment