శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, July 31, 2010

వీధుల వీధుల

వీధుల వీధుల విభుడేగేనిదె మోదము తోడుత మొక్కరో జనులు

గరుడ ధ్వజంబదె కనకరధంబదె అరదముపై హరి అలవాడే
ఇరుదెసలనున్నారు ఇందిరయు భువియు పరగ పగ్గములు పట్టరో జనులు

ఆడేరదివో అచ్చరలెల్లరు పాడేరు గంధర్వ పతులెల్ల
వేడుకతో వీడే విష్వక్సేనుడు కూడి ఇందరును కొలువరో జనులు

శ్రీ వేంకటపతి శిఖరముచాయదె భావింప బహువైభములవె
గోవింద నామపు ఘోషణలిడుచును దైవంబితడని తలచరో జనులు

No comments:

Post a Comment