శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, July 31, 2010

వీణ వాయించనే

వీణ వాయించనే అలమేలుమంగమ్మ వేణుగాన విలోలుడైన వేంకటేశునోద్ద

కురులు మెల్లన జారగా సన్నజాజివిరులూ
కరకంకణంబులు ఘల్లని మ్రోయగ మరువైన వజ్రాల మెరుగుతులాడగా

సందటి దండలు కదలగాను ఆణిముత్యాల సరులు వుయ్యాలలూగగాను
అందమై పాలిండ్లను అలదిన కుంకుమ గంధము చెమటచే కరిగే ఘుమఘుమమనగా

ఘనన యనములూ మెరయగా వింతరాగమును ముద్దులు కులుకగా
ఘననిభవేని జంత్రగాత్రము మెరయగ వినెడి శ్రీవేంకటేశుల వీనులవిందుగా

No comments:

Post a Comment