శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, July 31, 2010

వీడె వీడె కూచున్నాడు

వీడె వీడె కూచున్నాడు వేడుకతో గద్దెమీద వాడి ప్రతాపముతోడి వరదాన సింహము

అరయ ప్రహ్లాదుని ఆపదోద్ధార సింహము గిరిపై ఇందిరకును క్రీడా సింహము
నిరతి సురల భయనివారణ సింహము సరి హిరణ్యకశిపుసంహార సింహము

ఇట్టె విశ్వమునకు ఏలికైన సింహము గట్టిగ శరణాగతుల గాచే సింహము
దిట్టమై వేదాలలోని తెరవేట సింహము నెట్టుకొనిన దురితనివారణ సింహము

అంచెల మూడు మూర్తుల కాధారమైన సింహము పంచల మునుల భాగ్యఫల సింహము
పొంచి శ్రీవేంకటాద్రికి భూషణమైన సింహము చెంచుల అహోబలపు శ్రీనారసింహము

No comments:

Post a Comment