వీడివో యిదె వింతదొంగ వేడిపాలు వెన్న వెరజినదొంగ
వెలయ నీట జోప్పువేసేటి దొంగ తలగాననీక దాగుదొంగ
తలకక నేలదవ్వేటిదొంగ తెలిసి సందెకాడ దిరిగేటి దొంగ
అడుగుకింద లోకమడచేటి దొంగ అడరి తల్లికినైన నలుగుదొంగ
అడవిలో నెలవైయున్న దొంగ తొడరి నీలికాసెతో నుండుదొంగ
మోస మింతుల జేయుమునిముచ్చుదొంగ రాసికెక్కినగుఱ్ఱంపుదొంగ
వేసాల కిటు వచ్చి వెంకటగిరిమీద మూసినముత్యమై ముదమందుదొంగ
No comments:
Post a Comment