శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, July 29, 2010

విరహాన బడలెను

విరహాన బడలెను విభుడు యిందాకాను పురుషార్థమిందు వంక బొందేదేమే

కంతునిదీపమవై ఘమ్మని భ్రమయించేవు పొంత నిండు వంక నేమిపుణ్యమే నీకు
పంతమున వలపించి పలుమారు నలిగేవు యెంత లాభము గలిగె నిందు వంక నీకు

చెరకు సింగణివై చెలువుని నేచేవు గురిగా నెంత ధనము గూడెనే నీకు
వెరగువడుచు నీవు వెంటవెంట దిప్పేవు నెర దొరతనమెంత నేర్చితివె నీవు

పూవుల గాలమవై పురుషుని దగిలేవు వేవే యెంత రాజ్యమేలితిదె నీవు
యీవల శ్రీ వేంకటేశుడితడిట్టె నిన్నుగూడె కైవశమై యెంత కొడిగట్టితివె నీవు

No comments:

Post a Comment