శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, July 29, 2010

విఱిగిరి దానవవీరు

విఱిగిరి దానవవీరు లదె అఱిముఱి దేవత లాడే రదె

సరగునకంభ మదె పగిలె నదె హరినరసింహంబాయ నదె
గరుడధ్వజ మదె ఘనచక్రం బదె మొరసేటిశంకపుమ్రోత లవె

వెడలె వెడలె నదె పెనుకొని హిరణ్యు దొడికిపట్టె నదె తొడమీద
విడువక చించిన వేయిచేతులవె కడపమీదనే కదల డదె

అదె వామాంకంబందు లక్ష్మియదె కదిసి శాంతమదే కరుణ యదె
వుదుటున ప్రహ్లాదు నూరడించె నదె యిదె శ్రీవేంకట మెక్కె నదె

No comments:

Post a Comment