శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, July 29, 2010

వివేకమెఱుగనివెఱ్ఱులముగాక

వివేకమెఱుగనివెఱ్ఱులముగాక నేము దివారాత్రము నిన్నే ద్రిష్టించవలదా

మానివోడ నమ్మి వొక్కమనుజుడు వార్ధి దాటి నానార్థములు గూర్చి నటించగాను
దానవారికృప నమ్మి తగినసంసారవార్ధి లోను చొచ్చి దాటి గెల్వ లోకులకు జెల్లదా

జుట్టెడుయినుము నమ్మి సొరిది నొక్కడు భూమి గట్టడిభయములెల్ల గడవగాను
నెట్టన జక్రాయుధుని నిజనామ మిటు నమ్మి తట్టి భవభయములు తరి దాటజెల్లదా

వేలెడుదీపము నమ్మి వెడగుజీకటి బాసి పోలిమి నొక్కనరుడు పొదలగాను
ఆలించి శ్రీవేంకటేశు డాత్మలో వెలుగగాను మేలి మాతని గొలిచి మెరయంగవలదా

No comments:

Post a Comment