శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, July 29, 2010

వివేకించ వేళ లేదు

వివేకించ వేళ లేదు విజ్ఞానమార్గమందు భవసంపదలపెద్దపౌజు చూచీ జీవుడు

చిత్తమనియెడి మహాసింహాసనం బెక్కి హత్తిబహుపరాకాయ నదె జీవుడు
గుత్తపుదేహమనేటికొలువుకూటములోన జొత్తు బ్రకృతినాట్యము చూచీవి జీవుడు

పంచేంద్రియములనేబలుతేజీలపై నెక్కి అంచల వయ్యాళిదోలీ నదె జీవుడు
ముంచినకర్మములనేముద్రలపెట్టెలు దెచ్చి సంచముగా లెక్కవెట్టి సరి దాచీ జీవుడు

యిచ్చ గామక్రోధాలనే హితమంత్రులును దారు తచ్చి తలపోసుకొనీ దగ జీవుడు
అచ్చపుశ్రీవేంకటేశు డంతరాత్మయై యుండగా పచ్చిగా నాతని జూచి భ్రసీని జీవుడు

No comments:

Post a Comment