శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, July 29, 2010

విశ్వప్రకాశునకు

విశ్వప్రకాశునకు వెలియేడ లోనేడ శాశ్వతునకూహింప జన్మమికనేడ

సర్వ పరిపూర్ణునకు సంచారమిక నేడ నిర్వాణమూర్తికిని నిలయమిక నేడ
వుర్వీధరునకు కాలూదనొకచోటేడ పార్వతీస్తుత్యునకు భావమిక నేడ

నానా ప్రభావునకు నడుమేడ మొదలేడ ఆనన సహస్రునకు నవ్వలివ లేడ
మౌని హృదయస్తునకు మాటేడ పలుకేడ జ్ఞానస్వరూపునకు కానవిన వేడ

పరమ యోగీంద్రునకు పరులేడ తానేడ దురిత దూరునకు సంస్తుతి నిందలేడ
తిరువేంకటేశునకు దివ్య విగ్రహమేడ హరికి నారాయణున కవుగాములేడ

No comments:

Post a Comment