విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో శాశ్వతులమైతిమింక జయము నాజన్మము
కొండవంటి హరిరూపు గురుతైన తిరుమల పండిన వృక్షములే కల్పతరువులు
నిండిన మృగాదులెల్ల నిత్యముక్తజనములు మెండుగ ప్రత్యక్షమాయె మేలువోనాజన్మము
మేడవంటి హరిరూపు మించైనపైడి గోపుర మాడనే వాలిన పక్షుల మరులు
వాడల కోనేటి చుట్ల వైకుంఠ నగరము యీడమాకు పొడచూపె ఇహమేపోపరము
కోటిమదనులవంటి గుడిలో చక్కని మూర్తి యీటులేని శ్రీ వేంకటేశుడితడు
వాటపు సొమ్ములు ముద్ర వక్షపుటలమేల్మంగ కూటువైనన్నేలితి యెక్కువనోనాతాపము
No comments:
Post a Comment