శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, July 31, 2010

విష్ణు దేవు పాదములే

విష్ణు దేవు పాదములే విద్యబుధ్ధీ మాకు వైష్ణవులమైతి మింక వదలవో కర్మమా

గోవిందునిపాదములే కోరి యిహపరములు శ్రీవిభునిపాదములే చేరువేదశాస్త్రములు
దేవదేవుపాదములే దిక్కును దెసయు మాకు భావములో నిలిపితి పాయరో పాపములు

హరిపాదములే మాకు నన్నపానభోగములు పరమాత్ము పాదములే పాడీ పంటా మాకు
మురహరు పాదములే ముందర వెనకా మాకు శరణంటి మెందైనా చనరో దుఃఖములు

అనంతుని పాదములే ఆయుష్య భౌష్యములు దనుజారి పాదములే ధనధాన్య ధర్మములు
యెనలేని శ్రీవేంకటేశు డితనిపాదాలే మనసున గొలిచితి మానరో భవములు

No comments:

Post a Comment