శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, August 1, 2010

వెట్టిమోపువంటిమేను

వెట్టిమోపువంటిమేను విడనాడి వీడిట్టె దాటిపోయె నెటువంటిజాణే

ఘోరమైన ఆసలనెడికూకటవేరు దవ్వి పారవేసి యిడుమల బడనొల్లక
యీరసపుసంసార మింగలము దగిలించి యేరు దాటిపోయె నెటువంటిజాణే

కన్నవారి దన్ను బ్రేమ నన్నవారి దిగనాడి వున్నతమైనచోట నుండబోయి
తన్నుదా వేంకటపతి దాసులజేరి వాడు యెన్నడు దిరిగిరాడే యెటువంటిజాణే

No comments:

Post a Comment