శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, August 1, 2010

వెడమంత్ర మికనేల

వెడమంత్ర మికనేల వేరువెల్లంకులు నేల పుడమిధరుడు మాకు భువనౌషధము

హరి యచ్యుతాయంటే నణగు బాపములు నరసింహా యనియంటే నాటినదుఃఖములు మాను
పురుషోత్తమాయంటే బుండ్లు బూచులు మాను పరమౌషధ మీతడే పాటింప మాకు

వాసుదేవ యనియంటే వదలు బంధములెల్లా వాసికి గృష్ణాయంటే వంతలరోగాలు మాను
శ్రీసతీశ యనియంటే చింతలన్నియును మాను గాసిదీర నితడే ఘనదివ్యౌషధము

గోవిందా యనియంటే గూడును సంపదలు యీవల మాధవయంటే నిహము బరము జేరు
దేవ నారాయణయంటే దేహము సుఖియై యుండు శ్రీవేంకటేశుడే మాకు సిద్ధౌషధము

No comments:

Post a Comment