వెదకిన నిదియే వేదార్థము మొదలు తుదలు హరి మూలము
యెరవగు గుణములు యెన్ని కలిగిన పరమ జ్ఞానము ప్రధానము
యిరవుగ శ్రీ వేంకటేశ్వర నామము సరవి మంత్రముల సారము
మునుకొని అవయవములు యెన్నైనా పనిపడి శిరసే ప్రధానము
యెనలేని సురలు యెందరు గలిగిన మునుపటి హరియే మూలంబు
మోవని ఇంద్రియములు యెన్నైనా భావపు మనసే ప్రధానము
యీవల మతములు యెన్ని కలిగినా మూవురలో హరి మూలంబు
No comments:
Post a Comment