శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, August 1, 2010

వెనక ముందరికి

వెనక ముందరికి బెద్దల కెల్లను వివరపు సమ్మతి యీ వెరవు వెనుకొని తన గురు నాథుని యనుమతి వేదోక్తంబగునీ తెరవు

కనకాసక్తుడు గాకుండుట మది కైవల్యమునకు నొక తెరువు వనితల భ్రమలకు వలల దగులని వైకుంఠమునకు నొక తెరువు
మును కోపము బెడ బాసిన మతి మోక్షంబునకును నొక తెరువు యెనసి యిందుపై హరి దలచిన మతి యిన్నిటి కెక్కుడు యీ తెరువు

నిరతి విషయముల నణచిన ధృఢ మతి నిశ్శ్రేయసమున కొక తెరువు విరతి తోడ నెలవైన మతి విభవపు బరమున కొక తెరువు
వెరవున నిందరి మీదటి సమమతి విష్ణులోకమున కొక తెరువు యిరవెరి గంతట హరి నమ్మిన మతి యిన్నిటి కెక్కుడు యీ తెరువు

జనక శీలుడ నేను జనకుడవు నీవు ఘనవేదాంత నిధివి కర్మిని నేను
అనిశము శ్రీ వేంకటా చలేంద్రుడవు నీవు పనుల నీ సంకీర్తన పరుడ నేను

No comments:

Post a Comment