వెనకేదో ముందరేదో వెఱ్రి నేను నా మనసుమరులు దేర మందేదొకో
చేర మీదటిజన్మముసిరులకు నోమేగాని యేరూపై పుట్టుదునో యెఱగ నేను
కోరి నిద్రించ బరచుకొన నుద్యోగింతుగాని సారె లేతునో లేవవో జాడ దెలియ నేను
తెల్లవారినప్పుడెల్లా తెలిసితిననేగాని కల్లయేదో నిజమేదో కాన నేను
వల్ల చూచి కామినుల వలపించేగాని మొల్లమై నామేను ముదిసిన దెరగ
పాపాలు చేసి మఱచి బ్రదుకుచున్నాడగాని వైపుగజిత్రగుప్తుడువ్రాయు టెఱగ
యేపున శ్రీవేంకటేశు నెక్కడో వెతకేగాని నాపాలిదైవమని నన్ను గాచుటెఱగ
No comments:
Post a Comment