శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, August 1, 2010

వెన్నలుదొంగిలునాటివెఱ్రివా

వెన్నలుదొంగిలునాటివెఱ్రివా నీవు విన్నకన్న జాడ గాదు వెఱ్రివా నీవు

చేరి నిన్ను నొల్లనట్టిజీవుల నీవు దరాన వీరుడవై మోచేవు వెఱ్రివా నీవు
నారపేరు నుడిగితే నాపేరంటా దగిలేవు వీరాన జుట్టమవై వెఱ్రివా నీవు

బంటులైనవారికి బరతంత్రుడవై యీ వెంట వెంట దిరిగేవు వెఱ్రివా నీవు
అంటే ననరాదు రెండు అడుకులకే చొచ్చేవు వింటే మాకు నవ్వు వచ్చీ వెఱ్రివా నీవు

పావనులయి లోకమెల్లా బదుకుమంటా బేళ్ళు వేవేలు వెట్టుకొంటివి వెఱ్రివా నీవు
శ్రీవేంకటేశుడవై చెంది వరము లిచ్చేవు వేవేగ నెవ్వరికైనా వెఱ్రివా నీవు

No comments:

Post a Comment