శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, August 1, 2010

వెన్నవట్టుక నేయి

వెన్నవట్టుక నేయి వెదకనేలా మరియు నెన్నివలసినను దమయేలేటివి కావా

తలపునకు విష్ణుచింతన నిమిషమాత్రంబు కలుగుటే కలుగవలెగాక
వలపైనభోగములు వైభవంబులు మరియు కలవెల్ల తమయెదుట గలిగినవె కావా

పదిలముగ హరినామపఠన మంత్రము నోరు కదియుటే కలుగవలెగాక
తుదిలేనిసంపదలు తొలగనిముదంబులును కదలకెప్పుడు దమకు గలిగినవె కావా

యించుకైనను వేంకటేశుగిరిశిఖరంబు కాంచుటే కలుగవలెగాక
అచింతంబైన నిత్యానందపదవులును మించి తమయెదుట బ్రభవించినవె కావా

No comments:

Post a Comment