శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, August 1, 2010

వెరపులు నొరపులు

వెరపులు నొరపులు వృథా వృథా ధరపై మరి యంతయును వృథా

తడయక చేసినదానంబులు వృథ యెడనెడ నెరిగినయెరుక వృథా
వొడలిలోనిహరి నొనరగ మతిలో దడవనిజీవమె తనకు వృథా

జగమున బడసినసంతానము వృథ తగిలి గడించినధనము వృథా
జగదేకవిభుని సకలాత్ముని హరి దెగి కొలువనిబుద్ధియును వృథా

పనివడికూడిన పరిణామము వృథ వొనరగనుండినవునికి వృథా
ఘనుడగు తిరువేంకటగిరిహరి గని మననేరని జన్మములు వృథా

No comments:

Post a Comment