వెరవకు మనసా విష్ణుని అభయము నెరవుగ యెదుటనే నిలిచి యున్నది
శ్రీపతి కరుణ జీవరాసులకు దాపును దండై తగిలినది
పైపై దేవుని బలు సంకల్పమె చేపట్టి రక్షించ చెలగేది
నలినోదరు నిజ నామాంకితమే ఇలపై దాసుల నేలేది
కలిభంజను శంఖ చక్ర లాంఛన మలవడి శుభముల నందించేది
శ్రీవేంకటపతి చేసిన చేతలే వేవేల చందాల వెలసినది
భూవిభుడితడు పూనిన మహిమలె కైవసమై మము గాచేది
No comments:
Post a Comment