శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, August 5, 2010

శరణు శరణు రామచంద్ర

శరణు శరణు రామచంద్ర నరేంద్రా సరి మమ్ముగావు రామచంద్రా నరేంద్రా

ఘన దశరథునకు కౌసల్యాదేవికిని జననమందిన రామచంద్రా నరేంద్రా
కనలి తాటకి చంపి కౌశుకుజన్నము గాచి చనవులిచ్చిన రామచంద్రా నరేంద్రా

అరిది సీత పెండ్లాడి అభయమందరికిచ్చి శరధిగట్టిన రామచంద్రా నరేంద్రా
అరసి రావణు చంపి అయేధ్యానగర మేలి సరవినేలిన రామచంద్రా నరేంద్రా

పన్నుగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వరు సన్నిధినిల్చిన రామచంద్రా నరేంద్రా
అన్నిటా లక్ష్మణభరతాంజనేయశత్రుఘ్నుల సన్నుతికెక్కిన రామచంద్రా నరేంద్రా

No comments:

Post a Comment