శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, August 5, 2010

శరణు కపీశ్వర

శరణు కపీశ్వర శరణం బనిలజ సరవి నెంచ నీసరి యిక వేరీ

పుట్టిననాడే భువనములెరగగ పట్టితి సూర్యుని పండనుచు
ముట్టిన చుక్కలు మోవగ పెరిగితి ఇట్టిప్రతాపివి యెదురేదయ్యా

అంపినయప్పుడే యంబుధి దాటితివి ఇంపులు సీతకు నిచ్చితివి
సంపద మెరయుచు సంజీవి దెచ్చితి పెంపును సొంపును పేర్కొనవశమా

చెదరక నేడే శ్రీవేంకటగిరి గదిసి రాముకృప గైకొంటి
వదలక నీకృపవాడనైతి నిదె యెదుటనే కాచితి విక కడమేమీ


Download

No comments:

Post a Comment