శరణంబితడే సకలము నాకును వెరవున మనసా వెతకవో ఇతని
అభయంబొసగెడి యతడెవ్వడు మును ఇభరక్షకుడు అతడెవ్వడు
ఉభయవిభూతుల కొడయండెవడూ ప్రభువితడే నాపాలి దేవుడు
శరణాగతులకు సరి దా నెవ్వడు యిరవుగ శ్రీపతి యెవ్వడు
అరి దుష్ట దైత్య హంతకు డెవ్వడు పరమును నతడె నాపాలి దేవుడు
ఆది శంఖ చక్రాయుధు డెవ్వడు యేదెస పూర్ణు డెవ్వడు
వేదమయుడు శ్రీ వేంకట పతియై పాదాయ నిదె నా పాలిదేవుడు
No comments:
Post a Comment