శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, August 5, 2010

శరణంటి

శరణంటి మాతనిసమ్మంధమున మరిగించి మమునేలి మన్నించవే

సకలవేదములు సంకీర్తనలు చేసి ప్రకటించి నిను బాడి పావనుడైన
అకలంకుడు తాళ్ళపాకన్నమాచార్యుల వెకలియై యేలిన శ్రీవేంకటనిలయ

నారదాది సనకసనందనాదులవలె పేరుపడి నిన్ను బాడి పెద్దలైనట్టి
ఆరీతి దాళ్ళపాకన్నమాచార్యుల చేరి యేలినయట్టి శ్రీ వేంకటనిలయ

సామవేదసామగానసప్తస్వరములను బాముతో నీసతి నిన్ను బాడినయట్టి
ఆముకొన్న తాళ్ళపాకన్నమాచరుల వేమరు మెచ్చిన శ్రీ వేంకటనిలయా

No comments:

Post a Comment