శమముచాలనియట్టిజన్మం బిదేమిటికి దమముచాలనియట్టితగు లిదేమిటికి
పగయునుబోలె నాపై సేయునడియాస తగిలి యేపనేకాని దయ గొంత లేదు
జగడమునబోలె నలసతిలేనిమమత దను తెగి వేచనేకాని తీరుగడ లేదు
ఋణమునుబోలె తీరియుదీరనిది కర్మ గణనగలకాలంబు కడ మొదలు లేదు
వ్రణమునుబోలె విడువక రాగదేహజపు గుణము సౌఖ్యముతెరువు గొంతయును
నీతియుబోలె బ్రాణికి వేంకటేశుకృప చేతికి నిధానంబు చేరినట్లాయ
భూతములుబోలె తలపున కితరసంస్మరణ భీతిపుట్టించి యప్రియభావమాయ
No comments:
Post a Comment