శతాపరాధములు సహస్రదండన లేదు గతి నీవని వుండగ కావకుండగారాదు
తలచి నీకు మొక్కగా దయజూడకుండరాదు కొలిచి బంటుననగా కోపించరాదు
నిలిచి భయస్తుడనై నీయెదుట దైన్యమే పలుక గావకుండ బాడిగాదు నీకు
శరణు చొరగ నీకు సారె నాజ్ఞ వెట్టరాదు సరి బూరి గరవగ చంపరాదు
అరయ జగద్రోహినౌదు నైనా నీనామము గరిమె నుచ్చరించగ గరగక పోదు
దిక్కు నీవని నమ్మగా దిగవిడువగరాదు యెక్కువ నీలెంకగాగా యేమనరాదు
తక్కక శ్రీవేంకటేశ తప్పులెల్లా జేసి వచ్చి యిక్కడ నీదాసినైతి నింక దోయరాదు
No comments:
Post a Comment