శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, August 2, 2010

వైష్ణవులుగా

వైష్ణవులుగానివార లెవ్వరు లేరు విష్ణుప్రభావ మీవిశ్వమంతయు గాన

అంతయు విష్ణుమయంబట మరి దేవ తాంతరములు గలవనేలా
భ్రాంతి బొంది యీభావము భావించి నంతనే పుణ్యులౌట దప్పదుగాన

యెవ్వరి గొలిచిన నేమిగొరత మరి యెవ్వరి దలచిన నేమి
ఆవ్వలివ్వల శ్రీహరిరూపు గానివా రెవ్వరు లేరని యెరుకదోచిన జాలు

అతిచంచలంబై నయాతును గలిగించు కతమున బహుచిత్తగతులై
యితరుల గొలిచైన యెదాయక యనాథ పతివేంకటపతి చేకొనుగాక

No comments:

Post a Comment