వేసరితిమెట్ల నీవెంట దిరిగి గాసిబెట్టక మమ్ము గావరారా
తీసితివి కోరికల తెగనీక పంచలకు తోసితివి యింటింట దోయదోయ
చేసితివి నీచేత చెల్లె నికనైనను ఆస నీపొందొల్ల మంపరాదా
కట్టితివి కర్మముల కడదాక నాపదల బెట్టితివి దుఃఖముల బెనచిపెనచి
పట్టితివి చలము మము పాయనని యాస నీ విట్లైన గొంత సుఖమియ్యరాదా
కరపితివి పాపములే కడగి నానావిధుల నెరపితివి దుర్దశలే నేర్పుమెరసి
తెరగొసంగియును శ్రీతిరువేంకటేశ్వరుని నెరిగియును నెరగలేమింక నేతెరువో
No comments:
Post a Comment