వేసరించేదానగాను వేగినంతా నిన్నును రాశికెక్క మీకృపనే రతి జెలగుదును
నట్టనడుమనే నీవు నావాడవై వుంటేజాలు అట్టే నే నెంతటి నైనా నౌదును
గుట్టుతోడ నీవునాకు గొలువిచ్చితే జాలు నెట్టన లోకమునకు నేనే రాజౌదును
కందువ నీవు నన్ను గన్నుల జూచితేజాలు అందపు సిరుల నోలలాడుదును
మందలించి నాతో నొక మాటలాడితే చాలు పందెమాడి నీచే తుదిపదము చేకొందును
చేరి శ్రీవేంకటేశ్వర సెలవి నవ్వితే జాలు కోరి నీవలపులకు గురి యౌదును
సారె నలమేల్మంగను సతి నీకు నైతే జాలు మేరతో గూడితిని మేలెల్లా సాదింతును
No comments:
Post a Comment