శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, August 5, 2010

శరణు శరణు వేద

శరణు శరణు వేద శాస్త్రనిపుణ నీకు అరుదైన రామ కార్యదురంధరా

హనుమంతరాయ అంజనాతనయా ఘనవాయుసుత దివ్యకామరూప
అనుపమలంకాదహన వార్ధిలంఘన జనసురనుత కలశాపురనివాస

రవితనయస చివ రావణవనాపహార పవనవేగబలాఢ్య భక్తసులభ
భువనపూర్ణదేహా బుధ్ధివిశారద జవసత్వవేగ కలశాపురనివాస

సీతాశోకనాశన సంజీవశైలాకర్షణ ఆతతప్రతాపశౌర్యా అసురాంతకా
కౌతుక శ్రీవేంకటేశు కరుణాసమేత సాతకుంభవర్ణ కలశాపురనివాస

No comments:

Post a Comment