శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, August 5, 2010

శరణు శరణు సురేంద్ర

శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీసతి వల్లభా శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయకా

కమలధరుడును కమలమిత్రుడు కమలశత్రుడు పుత్రుడు
క్రమముతో మీకొలువు కిప్పుడు కాచినా రెచ్చరికయా

అనిమిషేంద్రులు మునులు దిక్పతులమర కిన్నర సిద్ధులు
ఘనతతో రంభాదికాంతలు కాచినా రెచ్చరికయా

ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను గొలువగ వచ్చిరీ
విన్నపము వినవయ్య తిరుపతి వేంకటాచలనాయకా

No comments:

Post a Comment