శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, August 6, 2010

సిరిదొలంకెడి

సిరిదొలంకెడి పగలూచీకటా యితడేమి యిరవుదెలిసియు దెలియనియ్య డటుగాన

తలపోయ హరినీలదర్పణంబో ఇతడు వెలుగుచున్నాడు బహువిభవములతోడ
కలగుణంబటు వలెనెకాబోలు లోకంబు గలదెల్ల వెలిలోన గనిపించుగాన

మేరమీరిననీలమేఘమా యితడేమి భూరిసంపదలతో బొలయుచున్నాడు
కారుణ్యనిధియట్ల కాబోలు ప్రాణులకు కోరికలు దలపులో గురియు నటుగాన

తనివోని ఆకాశతత్త్వమో యితడేమి అనఘుడీ తిరువేంకటాద్రి వల్లభుడు
ఘనమూర్తి అటువలెనె కాబోలు సకలంబు తనయందె యణగి యుద్భవమందుగాన

No comments:

Post a Comment