శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, August 6, 2010

సిరుత నవ్వులవాడు

సిరుత నవ్వులవాడు సిన్నెకా వీడు వెరపెరుగడు సూడవే సిన్నెకా

పొలసు మేనివాడు బోరవీపు వాడు సెలసు మోరవాడు సిన్నెకా
గొలుసుల వంకల కోరలతోబూమి వెలిసినాడు సూడవే సిన్నెకా

మేటి కురుచవాడు మెడమీది గొడ్డలి సీటకాలవాడు సిన్నెకా
ఆటదానిబాసి అడవిలో రాకాశి వేటలాడీ జూడవే సిన్నెకా

బింకపు మోతల పిల్లగోవివాడు సింక సూపులవాడు సిన్నెకా
కొంకక కలికియై కొసరి కూడె నన్ను వేంకటేశుడు సూడవే సిన్నెకా


Download

No comments:

Post a Comment