శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, August 6, 2010

సీతాశోకవిఘాతక

సీతాశోకవిఘాతక వోపాతాళలంకాపతివిభాళా

హనుమమ్తరాయ అంజనీతనయ వోవనధిలంఘనగాత్ర వాయుపుత్రా
యినకులాధిపనిజహిత జగన్నుత వనజోదరసేవక సత్వధనికా

ప్రళయాంతికరూప బలదీప రవిఫల గిళనప్రతాప సుగ్రీవప్రియా
కుళికదానవసంకులవిదారణ భళిభళి జగత్పతిబలుబంటా

పంకజాసనుదివ్యపదవైభవ వోలంకిణీప్రాణవిలంఘన
వేంకటేశ్వరుసేవావీర మహాధీర కింకరరాయ సుఖీభవా

No comments:

Post a Comment