శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, August 6, 2010

సుఖమును దుఃఖమును

సుఖమును దుఃఖమును జోడుకోడెలు అఖిలముగన్నవారు అడ్డమాడ రెపుడు

యెందాకా సంసార మెనసి తా జేసేను అందాకా లంపటము లవి వోవు
కందువజీవుడు భూమి గాయ మెన్నాళ్ళు మోచె అందుకొన్నతనలోని యాసలూ బోవు

అప్పటి దనకు లోలో ఆక లెంతగలిగినా తప్పక అందుకు దగ దాహము బోదు
అప్పు దనమీద మోచి అదె యెన్నాళ్ళు వుండె ముప్పిరి వడ్డివారక మూలనుండినా బోదు

దైవముపై భక్తిలేక తనకు నెన్నాళ్ళుండే దావతి కర్మపుపాటు తనకు బోదు
శ్రీవేంకటేశ్వరునిసేవ దనకెప్పుడబ్బె వోవరి నందలిమేలు వొల్లనన్నాబోదు

No comments:

Post a Comment