శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, August 6, 2010

సుగ్రీవ నారసింహ

సుగ్రీవ నారసింహ సులభుడ వందరికి అగ్రేసరుడ నీవు అవధారు దేవ

సనకాదులొకవంక జయవెట్టుచున్నారు ఎనసి సురలు చేతులెత్తి మొక్కేరు
మును లిరుమేలనుండి మునుకొని నుతించేరు అనుపమాలంకార అవధారు దేవ

గంగాది నదులెల్ల కడిగి నీపాదములు పొంగుచు సప్తర్షులు పూజించేరు
సంగతి వాయుదేవుడు సరి నాలవట్టమిడీ అంగజ కోటిరూప అవధారు దేవ

పరగ నారదాదులు పాడేరు నీచరిత పరమ యోగీంద్రులు భావించేరు
సిరులు మించినయట్టి శ్రీవేంకటాద్రిమీద అరుదుగ నున్నాడవు అవధారు దేవ

No comments:

Post a Comment