శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, August 5, 2010

సంసారమే మేలు

సంసారమే మేలు సకల జనులకును కంసాంతకుని భక్తిగలిగితే మేలు

వినయంపు మాటల విద్య సాధించితే మేలు తనిసి యప్పులలోన దాగకుంటే మేలు
మునుపనే భుమి దన్నుమోచి దించకుంటే మేలు వెనుకొన్నకోపము విడచితే మేలు

కొరివొకరి నడిగి కొంచపడకుంటే మేలు సారె సారె జీవులను చంపకుంటే మేలు
భరపుటిడుమలను పడకుండితే మేలు కారించి తిట్ల కొడిగట్టకుంటే మేలు

పరకాంతల భంగపరచకుంటే మేలు దొరకని కెళవులు దొక్కకుంటే మేలు
అరుదైన శ్రీ వేంకటాద్రి విభుని గొల్చి యిరవై నిశ్చింతుడైతే నిన్నిటాను మేలు

No comments:

Post a Comment