శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, August 5, 2010

సంసారినైన నాకు

సంసారినైన నాకు సహజమే కంసారి నేనిందుకెల్లా గాదని వగవను

నరుడనైననాకు నానాసుఖదుఃఖములు సరి ననుభవించేది సహజమే
హరిని శరణాగతులైనమీద బరాభవ మరయ నిన్నంటునని అందుకే లోగేను

పుట్టిననాకు గర్మపు పొంగుకు లోనైనవాడ జట్టిగ గట్టువడుట సహజమే
యిట్టే నీవారికి మోక్షమిత్తునన్న నీమాట పట్టు వోయీనోయని పంకించే నేనిపుడు

మాయకులోనైన నాకు మత్తుడనై యిన్నాళ్ళు చాయకు రానిదెల్లా సహజమె
యీయెడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నీవు మోయరాని నేను మోపనివీగేను

No comments:

Post a Comment