శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, August 5, 2010

సకల జీవులకెల్ల

సకల జీవులకెల్ల సంజీవి యీమందు వెకలులై యిందరు సేవించరో యీమందు

మూడు లోకము లొక్కట ముంచి పెరిగినది పోడిమి నల్లని కాంతి బొదలినది
పీడుక కొమ్ములు నాల్గు పెనచి చేయువారినది వాడే శేషగిరిమీద నాటుకొన్న మందు

పడిగెలు వేయింటి పాము గాచుకున్నది కడు వేదశాస్త్రముల గబ్బు వేసీది
యెడయక వొకకాంత యెక్కుక వుండినది కడలేని యంజనాద్రి గారుడపు మందు

బలు శంఖు జక్రముల బదనికెలున్నది తలచిన వారికెల్ల దత్త్వమైనది
అలరిన బ్రహ్మరుద్రాదుల బుట్టించినది వెలుగు తోడుత శ్రీవేంకటాద్రి మందు

No comments:

Post a Comment