సకల సంగ్రహము సకల సంచయము అకృతసుకృత మిది హరినామం
సకలవేదశాస్త్రములసార మిది సకలమంత్రరాజంబు నిది
సకలపురాణ రసములమధుర మిది అకుటిలపావనం హరినామం
సకలతత్త్వ సంశయఖండన మిది సకలకర్మ నిశ్చయము నిది
సకలవిధి రహస్యప్రధాన మిది అకారణహితం హరినామం
సకలదేవతా స్వామిప్రియం బిది సకలలోక రక్షణము నిది
ప్రకటం వేంకటపతి నామాంకిత మకించనధనం హరినామం
Download
No comments:
Post a Comment