శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, August 6, 2010

సేస పెట్టవయ్యా

సేస పెట్టవయ్యా యిట్టి చెలిమీదను ఆసలమీకిద్దరికి నన్నిటా నమరును

గ్రక్కన జెట్టవట్టితే కంకణము వంటిదాపె దక్కి వురమెక్కితేను తాళి వంటిది
మొక్కలాన దొడ దొక్కితే మొలనూలు వంటిది అక్కజమై నీకు నాపె నన్నిటా నమరును

చేరి విన్నవించితే చెవి పోగుల వంటిది నీరతికి వద్దనుంటే నీడవంటిది
కోరి పానుపుపై పెండ్లి కూతురు వంటిదేపొద్దు ఆరీతి ఆపెకు నీకు నన్నిటా నమరును

పాదాల సేవ సేసితే పావకోళ్ళ వంటిది సోదించి చూచితేను సొమ్ము వంటిది
యీదెస శ్రీవేంకటేశ యింతి నీవు గూడితివి ఆదిగొని నీకు నాపె కన్నిటా నమరును

No comments:

Post a Comment