శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, August 6, 2010

సొంపుల నీ

సొంపుల నీ వదనపు సోమశిలకనుమ యింపులెల్ల జేకొనగ నిల్లు నీవతికి

కలికి నీ పిఋదనే గద్దె రాతి కనుమ మొలనూళ్ళ లతలనే ముంచుకున్నది
కలయ బోకముడినే కట్లు వడ్డది అలరు విలుతు దాడికడ్డము నీ పతికి

ఇదివో నీ కెమ్మోవి యెఅశిలకనుమ కదిసి లేజిగురుల గప్పుకొన్నది
వదలకింతకు దలవాకిలైనది మదనుని బారికి మాటువో నీపతికి

కాంతనీ చిత్తమే దొంగలసాని కనుమ ఇంతటి వేంకటపతికిరవైనది
పంతపు నీ గుబ్బలే గుబ్బలికొండకనుమ మంతనాల కనుమాయ మగువ నీపతికి

No comments:

Post a Comment