శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, August 6, 2010

సొగియునా మఱియు

సొగియునా మఱియు ముచ్చుకు బండువెన్నెలలు పగవానివలెనె లోపల దాగుగాక

దక్కునా పేదకును తరముగానిధనంబు చిక్కి యెవ్వరికైన జేరుగాక
వెక్కసంబైన గోవిందునిదలపుబుద్ధి తక్కినపరులకెల్ల దలపేల కలుగు

అరగునా దుర్బలున కరుదైనయన్నంబు కురుచబుద్ధులను నరమిగొనుగాక
తొరలునా హరివినుతి దుష్టునకు నది నోర దొరలెనా యతనినే దూషించుగాక

చెల్లునా యమృతంబు సేవించ నధమునకు వొల్లనని నేలపై నొలుకుగాక
వెల్లిగొనుమందునకు వేంకటేశుస్మరణ చల్లనౌనా మనసు కఠియించుగాక

No comments:

Post a Comment