శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, August 6, 2010

సొరిది సంసారంబు

సొరిది సంసారంబు సుఖమా యిందరికి వెరవెఱంగక వగల వేగేరుగా

దేహములు దలప సుస్థిరములా ప్రాణులకు నూహింప లోభ మట్లుండుగాక
మోహంబుచే వెనుకముందెఱుగలేక తమ దేహసుఖములు మరిగి తిరిగేరుగాక

నెలకొన్నద్రవ్యములు నిలుచునా యెవ్వరికి అలవి నిలుపగరాని యాసగాక
బలువైనవట్టిభ్రాంతిచే దగులువడి తెలిసియును దెలియకిటు తిరిగేరుగాక

నెఱయువిభవములెల్ల నిజములా యిందరికి కొఱమాలినట్టి తమగుణముగక
యెఱుకతో దిరువేంకటేశు గొలువగలేక తెఱగుమాలినబుద్ధి దిరిగేరుగాక

No comments:

Post a Comment