సువ్వి సువ్వి సువ్వాలమ్మా నవ్వుచు దేవకి నందను గనియె
శశి వొడచె అలసంబులు గదచె దిశ దేవతల దిగుళ్ళు విడచె
కావిరి విరసె కంసుడు గినిసె వావిరి పువ్వుల వానలు గురిసె
గతి సేసె అటు గాడిద గూసె కుతిలకుడిచి జనకుడు నోరు మూసె
గగురు పొడిచె లోకము విధి విడిచె మొగులు గురియగ యమునపై నదచె
కలిజారె వేంకటపతి మీరె అలమేల్మంగ నాంచారమ్మకలుకలు తీరె
No comments:
Post a Comment