శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, August 6, 2010

సులభుడు మధుసూదనుడు

సులభుడు మధుసూదనుడు మన మెలమి నమ్మిన నిట్టేనుండీ

పడుచుమాటన కాప్రహ్లాదునెదుట పొడచూపె నాదిపురుషుడు
అడవిదేహనక ఆదంతిమొరకును తడవికాచిన దైవముసుండీ

ఆడుమాటలనక అంతలో ద్రౌపదిని వాడిమి గాచినవరదుడు
పోడిమి బేదనక పొందినకుచేలుని వీడె సంపదిచ్చె విష్ణుడు సుండీ

వీరువారన కిదె వేడినవరములు సారెకు నిచ్చిన సర్వేశుడు
మేరతో లోకముల మెరసె నిప్పుడును యీరీతి శ్రీవేంకటేశుడేసుండీ

No comments:

Post a Comment